Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పల్ వన్డే మ్యాచ్ : డ్రింక్స్ బ్రేక్ వేళకు భారత్ స్కోరు 95/2

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (15:02 IST)
హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం నుంచి జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 
 
శుభ్ మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అటు గిల్, ఇటు రోహిత్ ఆరంభం నుంచే మంచి షాట్లతో అలరించారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ 12 ఓవర్లలో తొలి వికెట్‌కు 60 పరుగులతో మంచి పునాది వేశారు. కానీ, టిక్నర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ మిడాన్‌‍లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా 34 పరుగులకే అతను వెనుదిరిగాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలదొక్కులేక పోయారు. శ్రీలంకతో సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన కోహ్లీ.. షిప్లీ బౌలింగ్ లో తొలి ఫోర్ కొట్టాడు. కానీ, 16వ ఓవర్లో అద్భుత టర్నింగ్ బాల్తో మిచెల్ శాంట్నర్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా విరాట్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 88/2. మరో ఓపెనర్ గిల్ మాత్రం ధాటిగా ఆడుతుండగా, డ్రింక్స్ బ్రేక్ సమయానికి భారత్ 17 ఓవర్లలో 95/2 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం గిల్ - కిషాన్‌లు క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

తర్వాతి కథనం
Show comments