Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పూర్ వన్డేలో కోహ్లీ సేన గ్రేట్ విక్టరీ... సిరీస్ కైవసం

పర్యాటక జట్టు న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (09:04 IST)
పర్యాటక జట్టు న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన... నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ముంగిట 338 పరుగులను టార్గెట్‌గా నిర్ధేసించింది. భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సెంచరీతో చెలరేగిపోయారు. 
 
భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ (147), శిఖర్ ధావన్ (14), కోహ్లీ (113), పాండ్యా (8), ధోనీ (25), జాదవ్ (18), కార్తీక్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో టీజీ సౌథీ 2, ఏఎఫ్ మిల్న్ 2, ఎంజె సాంత్నర్ 2 చొప్పున పరుగులు చేశారు. 
 
అనంతరం 337 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు చివరివరకు పోరాటం చేసి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేశారు. న్యూజిలాండ్ ఆటలో గుప్తిల్ (10), మున్రో (75), విలియమ్ సన్ (64), టేలర్ (39), నికోలస్ (37), లాథమ్ (65), సాంత్నర్ (9), గ్రాండ్హొమ్ 8,  సౌథీ 4 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, బుమ్రా 3, చాహల్ 2 చొప్పున పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments