Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ గడ్డపై దిగిన శ్రీలంక క్రికెటర్లు.. 8 ఏళ్ల తర్వాత మ్యాచ్.. భారీ భద్రత

పాకిస్థాన్ గడ్డపై ఎన్నో సంవత్సరాలకు తర్వాత క్రికెట్ ఆడేందుకు శ్రీలంక సంసిద్ధమైంది. లాహోర్‌‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల దాడి జరిగిన ఎనిమిది సంవత్సరాల తర

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:39 IST)
పాకిస్థాన్ గడ్డపై ఎన్నో సంవత్సరాలకు తర్వాత క్రికెట్ ఆడేందుకు శ్రీలంక సంసిద్ధమైంది. లాహోర్‌‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో   ఉగ్రవాదుల దాడి జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అదే గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంక కోసం ఆ దేశం భారీ భద్రత ఏర్పాటుచేసింది.

మూడవ టీ-20 పోరుకోసం వచ్చిన లంక క్రికెటర్ల భద్రత కోసం పాక్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసింది. ఎయిర్‌పోర్టులో వారు దిగినప్పటి నుంచి ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లి దించేంత వరకూ మార్గమధ్యంలో ప్రజలను ఏమాత్రం రానీయకుండా జాగ్రత్తపడింది. 
 
ఇందుకోసం పాకిస్థాన్ బాంబ్ ప్రూఫ్ బస్సును ఏర్పాటు చేసింది. వందల మంది సైనికులతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. 2009లో లంక టీమ్ ప్రయాణిస్తున్న బస్సుపై దుండగులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కాగా, తాజా పర్యటనలో భాగంగా లంక జట్టు మధ్యస్థ వేదికైన దుబాయ్‌లో పాకిస్థాన్‌తో కలసి మ్యాచ్ లు ఆడింది. చివరి టీ-20 మ్యాచ్‌ని లాహోర్‌లో ఆడి, ఆపై జట్టు కొలంబోకు చేరనుంది. 
 
ఇందుకోసం పాకిస్థాన్ వచ్చిన శ్రీలంక జట్టుకు పాకిస్థాన్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లపై ప్రపంచ దేశాలు విని షాక్ అయ్యాయి. ఇకనైనా పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు విదేశీ క్రికెట్ జట్లు పాకిస్థాన్‌కు వస్తాయని క్రీడా పండితులు అభిప్రాయ పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

తర్వాతి కథనం
Show comments