Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ ఖాతాలో 2 రికార్డులు.. ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయభేరి

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (16:01 IST)
అక్లండ్‌లో కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేధించి ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఫలితంగా 1-1 తేడాతో టీ-20 సిరీస్‌ను భారత్ సమం చేసింది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల పతనానికి 158 పరుగులు సాధించింది. 
 
భారత బౌలర్ల ధాటికి ధీటుగా రాణించలేకపోయారు.. కివీస్ బ్యాట్స్‌మెన్. అయితే గ్రాండ్ హోమ్ 50, టేలర్ 42 పరుగులు సాధించడంతో కివీస్ ఆ మాత్రం పరుగులైనా నమోదు చేసుకోగలిగింది. భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు, అహ్మద్ రెండు పడగొట్టగా.. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 
 
తదనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ 9.2 ఓవర్లలో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ రోహిత్ 50 పరుగులు సాధించి సోధీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆపై 30 పరుగుల వద్ద ధావన్ అవుట్ అయ్యాడు. విజయ్ శంకర్ 14 పరుగులు సాధించాడు. 
 
ఆపై క్రీజులోకి దిగిన పంత్, ధోనీ నిలకడగా ఆడుతూ జట్టును గెలిపించారు. యువ క్రికెటర్ పంత్ వేగంగా ఆడుతూ 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ధోనీ 20 పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్లలో మిచెల్, సోధీ, ఫెర్గ్యూసన్‌లు చెరో వికెట్ తీశారు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
 
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఖాతాలో రికార్డులు చేరాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా (2,288) అవతరించాడు. టీ20ల్లో అత్యధిక 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డును సాధించాడు. రోహిత్ ఈ ఘనతను 20 సార్లు సాధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

తర్వాతి కథనం
Show comments