Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెబ్బులిలా రెచ్చిపోయిన బంగ్లా.. తోకముడిచిన టీమిండియా

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (08:54 IST)
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బెబ్బులిలా రెచ్చిపోయింది. ఫలితంగా యువ రక్తంతో కూడిన టీమిండియా క్రికెట్ జట్టు తోకముడిచింది. దీంతో ట్వంటీ20 క్రికెట్‌లో బంగ్లా చేతిలో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. 
 
ఇరు క్రికెట్ జట్ల మధ్య మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆదివారం ఢిల్లీ వేదికగా ప్రారంభమైంది. తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. షకీబల్, తమీమ్ ల గైర్హాజరీతో బలహీనపడిందనుకున్న బంగ్లాదేశ్ జట్టు అనూహ్యరీతిలో పుంజుకుని ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేయగా, మరో మూడు బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ విజయతీరాలకు చేరింది. ఆ జట్టులో వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 
 
అలాగే, లిటన్ దాస్-7, మొహమ్మద్ నయీం-26, సర్కార్-39 పరుగులు చేసి ఔటవ్వగా ముస్తఫిజుర్ రహీం- 60, మహ్మదుల్లా-15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 20వ ఓవర్లో మూడో బంతికి తాత్కాలిక సారథి మహ్మదుల్లా సిక్స్ కొట్టడంతో బంగ్లా విజయం సాధించింది. 
 
లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో డీఎల్ చాహర్, అహ్మద్, చావల్‌కు తలో వికెట్ పడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో బంగ్లాదేశ్ కొనసాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

తర్వాతి కథనం
Show comments