Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌ను చితక్కొట్టిన రోహిత్ శర్మ... రెండో టీ20లో ఘన విజయం

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (09:21 IST)
రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును భారత కెప్టెన్ రోహిత్ శర్మ చితక్కొట్టాడు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు విసిరిన 154 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. 
 
గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. 
 
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 43 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేయడంతోపాటు.. శ్రేయాస్ అయ్యర్ 24, శిఖర్ ధవాన్ 31 పరుగులు చేయడంతో మరో 26 బంతులు మిగిలివుండగానే మ్యాచ్ ఫినిష్ అయింది. ఫలితంగా 3 మ్యాచ్‌లో సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నవంబరు 10న నాగ్‌పూర్‌లో జరగనుంది

సంబంధిత వార్తలు

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments