Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన భారత కుర్రోళ్ళు: అండర్-19 వరల్డ్ కప్ కైవసం

భారత యువ క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అండర్-19 వరల్డ్ కప్‌ను మరోమారు తమ వశం చేసుకున్నారు. ది ఓవెల్ మైదానంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తుది పోరులో నాలుగోసారి విశ్వవిజేతలుగా నిలిచారు.

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (14:08 IST)
భారత యువ క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అండర్-19 వరల్డ్ కప్‌ను మరోమారు తమ వశం చేసుకున్నారు. ది ఓవెల్ మైదానంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తుది పోరులో నాలుగోసారి విశ్వవిజేతలుగా నిలిచారు. 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువ జట్టు... కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకున్నారు. 
 
భారత ఓపెన‌ర్ మ‌న్‌జోత్ కైరా (101) అజేయ శ‌త‌కంతో భారత్ సునాయాసంగా ల‌క్ష్యాన్ని ఛేదించింది. దేశాయ్ (47 నాటౌట్‌) స‌హ‌కార‌మందించాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 217 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 38.5 ఓవర్ల‌లోనే రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఛేదించింది. 
 
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత యువ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు కంగారు పడిపోయారు. ఈ మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడినా.. స్పిన్న‌ర్లు దిగిన త‌ర్వాత సీన్ మారిపోయింది. 
 
ఇషాన్ పోరెల్‌, న‌గ‌ర్‌కోటి, అనుకూల్‌రాయ్‌, శివ సింగ్ తలా నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఒక ద‌శ‌లో 134 ప‌రుగుల‌కే 3 వికెట్ల‌తో ఉన్న ఆసీస్‌.. 82 ప‌రుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో ఆసీస్‌ను భారత బౌలర్లు పూర్తిగా క‌ట్ట‌డి చేశారు. 
 
కాగా, ఈ విజ‌యంతో భార‌త్ ఖాతాలో నాలుగో సారి ప్ర‌పంచ‌క‌ప్ చేరింది. దీంతో అత్య‌ధిక ప్ర‌పంచ‌క‌ప్‌లు నెగ్గిన జ‌ట్టుగా భార‌త్ అవ‌త‌రించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా స‌త్తా చాటింది. భారత యువ జట్టుకు క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments