Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వన్డేలో చిత్తుగా ఓడిన భారత్ - సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (07:22 IST)
స్వదేశంలో జరిగిన చెన్నై - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు కైవసం చేసుకున్నారు. బుధవారం చెన్నై వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించి 21 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 270 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయింది. ఓ దశలో హార్దిక్ పాండ్యా 40 పరుగులతో మెరుపులు మెరిపించి, భారత శిబిరంలో ఆశలు రేకెత్తించారు. కానీ, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అద్భతంగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు. జంపా 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఆస్టన్ అగర్ 2, స్టాయినిస్ 1, షాన్ అబ్బాట్ 1 చొప్పున వికెట్ తీశాడు. 
 
భారత ఇన్నింగ్స్‌లో కోహ్లీ అత్యధికంగా 54 పరుగులు చేయగా, ఓపెనర్ శుభమన్ గిల్ 37, కెప్టెన్ రోహిత్ శర్మ 30, కేఎల్ రాహుల్ 32 చొప్పున పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments