Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా చిత్తు.. తొలి ద్వైపాక్షిక సిరీస్ భారత్ వశం

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (16:22 IST)
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. భారత మాజీ కెప్టెన్ ధోనీ వీరోచిత బ్యాటింగ్, బౌలర్ చాహెల్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ కారణంగా ఆస్ట్రేలియా తలవంచక తప్పలేదు. ఫలితంగా మెల్‍బోర్న్ వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ధోనీ, జాదవ్‍లు అత్యంత కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పి విజయంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఫలితంగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుని, ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఘనంగా ముగిసింది. ఈ పర్యటనలో తొలుత ఆడిన ట్వంటీ-20 సిరీస్‌ను భారత్ సమం చేయగా, ఆ తర్వాత జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇపుడు మూడు వన్డేల సిరీస్‌ను కూడా 2-1 తేడాతో వశం చేసుకుని కెప్టెన్ కోహ్లీ సేన సరికొత్త చరిత్ర సృష్టించింది. 
 
కంగారూ నేలపై 1985లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2008 సీబీ సిరీస్‌లోనూ భారత్‌ విజేతగా నిలిచింది. అయితే దాంట్లో భారత్‌, ఆసీస్‌ సహా ఇతర జట్లు కూడా పాల్గొన్నాయి. 2016లో చివరిసారి ఎంసీజీలో జరిగిన వన్డేలో భారత్‌ 295/6 స్కోరు సాధించినా ఆసీస్‌ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. కానీ, ఈ సిరీస్‌లో మాత్రం భారత ఆటగాళ్లు మాత్రం అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, చరిత్రను పునరావృత్తం కానివ్వకుండా జట్టును గెలిపించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments