Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చెపాక్ స్టేడియంలో కంగారులను వణికించిన భారత బౌలర్లు.. టార్గెట్ 200 రన్స్

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (18:21 IST)
ఐసీసీ ప్రపంచ వన్డే కప్ మెగా టోర్నీలో భాగంగా, ఆదివారం ఆతిథ్య భారత్‌తో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులకు భారత బౌలర్లు తగిన రీతిలో కళ్లెం వేశారు. భారత స్నిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ జట్టును 199 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా భారత్ ముంగిట 200 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ (46) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. అలాగే, డేవిడ్ వార్నర్‌ (41), మార్నస్ లబుషేన్ (27), మ్యాక్స్‌వెల్ (15), పాట్ కమిన్స్‌ (15) పరుగులు చేశారు. మిచెల్ మార్ష్ (0), అలెక్స్‌ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. చివర్లో మిచెల్ స్టార్క్ 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేయడంతో ఆసీస్ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/28), కుల్‌దీప్‌ యాదవ్ (2/42), జస్‌ప్రీత్ బుమ్రా (2/35), అశ్విన్‌ (1/34) ఆసీస్‌ను కట్టడి చేశారు. సిరాజ్‌, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments