Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత రికార్డులకు ప్రపంచ కప్ వేదిక కారాదు : సహచరులకు రోహిత్ శర్మ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (14:46 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ వన్డే క్రికెట్ టోర్నీ వ్యక్తిగత రికార్డులకు వేదిక కారాదని తన సహచరులకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వన్డే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచన చేయొద్దని కోరారు. వ్యక్తిగత రికార్డులకు ఇది వేదిక కాదని వివరించారు. సమిష్టిగా జట్టును విజయతీరాలకు చేర్చాలని కోరారు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించడంపైనే ఆటగాళ్లంతా దృష్టి పెట్టాలని కోరారు. 
 
మరోవైపు, చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేశారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో ఒత్తిడి ఉండడం సహజమేనని చెప్పారు. అయితే, వాటిని ఎదుర్కొని నిలిచే సత్తా టీమిండియాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతీ సభ్యుడూ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొని వచ్చిన వారేనని వివరించారు. ఫస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో ఆడాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వివరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments