Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (14:20 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కంగారులు ఆరంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయారు. బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన మిచెల్ మార్ష్ మొత్తం ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ వార్నర్8 బంతుల్లో ఓ ఫోర్ కొట్టి 5 పరుగులు చేశాడు. ఇపుడు వార్నర్‌తో కలిసి స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా స్కోరు 2.4 ఓవర్లలో వికెట్ నష్టానికి ఐదు పరుగులు చేసింది. 
 
మరోవైపు, ఈ మ్యాచ్ కోసం డెంగీ బారినపడిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్‌కు పక్కనపెట్టేశారు. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. హార్దిక్ పాండ్యా నెట్స్‌లో గాయపడినట్టు వార్తలు వచ్చినప్పటికీ తుది జట్టులోకి తీసుకున్నారు. 
 
బుమ్రా, సిరాజ్, పాండ్యా పేస్ బాధ్యతలు పంచుకుంటారు. జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లతో స్పిన్ విభాగం అత్యంత బలంగా, వైవిధ్యభరితంగా ఉంది. దాంతో, ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కు, టీమిండియా బౌలర్లకు ఆసక్తికర పోరు జరగనుంది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్లు ఇలా ఉన్నాయి..
 
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
 
ఆస్ట్రేలియా : ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజెల్ వుడ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments