Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లో చాహెల్ మాయాజాలం : ఆసీస్ 230 ఆలౌట్.. భారత్ లక్ష్యం 231

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (12:11 IST)
భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు పూర్తి ఓవర్ల కోటా ముగియకముందే ఆలౌట్ అయింది. అంటే 48.4 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 230 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ చాహెల్ మాయాజాలంముందు కంగారులు బెంబేలెత్తిపోయారు. దీంత భారత్ ముంగిట 231 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచినట్టయింది. 
 
ఈ మ్యాచ్‌కు తొలుత వరుణదేవుడు ఆటంకం కలిగించాడు. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగినప్పటికీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేక పోయారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో కారీ 5, ఫించ్ 14, ఖవాజా 34, మార్ష్ 39, కాంబ్ 58, స్టోయిన్స్ 10, మాక్స్‌వెల్ 26, రిచర్డ్‌సన్ 16, జంపా 8 చొప్పున పరుగులు చేశారు. స్టాన్ లేక్ డకౌట్ కాగా, సిడిల్ పది పరుగులు చేశారు. ముఖ్యంగా, భారత స్పిన్నర్ చాహెల్ విజృంభించి ఏకంగా 6 వికెట్లు తీశాడు. భువనేశ్వర్, షమీలు రెండేసి వికెట్లు తీశారు. 
 
ముఖ్యంగా, వైఎస్ చాహెల్ పది ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీశాడు. 4.20 సగటుతో 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా చాహెల్ రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments