Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి వన్డే మ్యాచ్ : టాస్ ఓడిన భారత్ .. ఆసీస్ బ్యాటింగ్

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (09:08 IST)
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. సిడ్నీ వేదికగా శుక్రవారం ఉదయం 9 గంటలకు తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆరోన్ ఫించ్, ఇది బ్యాటింగ్ చేసే వారికి మంచి వికెట్ అని, కాస్తంత నిలదొక్కుకుంటే మంచి స్కోర్‌‌ను సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కాగా, తమ టీమ్‌లో మిచెల్ మార్ష్ బదులు స్టీవ్ స్మిత్‌ను జట్టులోకి తీసుకున్నామని అన్నారు. 
 
ఆ తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ తమ టీమ్‌కు చాలా ముఖ్యమని, అందరు ఆటగాళ్లూ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే సమయం ఆసన్నమైందని, కలిసికట్టుగా ఆడతామన్నారు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని, చాలా రోజుల తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతుందని అన్నాడు.
 
అయితే, ఈ వన్డే మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లో నిర్వ‌హించ‌డంతో సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లో ఉండే వాతావ‌ర‌ణం క‌నిపించ‌లేదు. 
 
సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం మొద‌ల‌య్యే తొలి వ‌న్డేతో ఇరు జట్ల వేట మొదలుకానుంది. ఈ సిరీస్‌కు అభిమానుల‌ను కూడా స్టేడియాల్లోకి అనుమ‌తిస్తున్నారు. సిడ్నీలో జ‌రిగే తొలి వ‌న్డేకు 50 శాతం మాత్ర‌మే నిండేలా ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించారు. 9 నెల‌ల త‌ర్వాత టీమిండియా ఆడ‌నున్న తొలి అంత‌ర్జాతీయ సిరీస్ కావ‌డంతో అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. 
 
గత ప‌ర్య‌ట‌న‌లో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచి చ‌రిత్ర సృష్టించిన కోహ్లి సేన.. ఈసారి కూడా అలాంటి అద్భుతం చేస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌కు లేక‌పోవ‌డం కాస్త లోటుగా క‌నిపిస్తోంది. 
 
మోవైపు, రోహిత్ శ‌ర్మ లేక‌పోవ‌డంతో శిఖ‌ర్ ధావ‌న్‌తో క‌లిసి మ‌యాంక్ అగ‌ర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మూడోస్థానంలో కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్, ఐదో స్థానంలో రాహుల్ బ్యాటింగ్‌కు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. 
 
ఈ సిరీస్‌లోనూ రాహులే వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు. ఇక బుమ్రా, ష‌మి ఇద్ద‌రూ తుది జ‌ట్టులో ఉంటే.. ఠాకూర్‌, సైనీల‌లో ఒక‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. అటు స్పిన్న‌ర్ల‌లో చాహ‌ల్ లేదా కుల్‌దీప్‌ల‌లో ఒక‌రిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది.
 
ఇండియా జట్టు: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహాల్
 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మార్నస్, స్టోయినిస్, గ్లెన్ మాక్స్ వెల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజల్ వుడ్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Christmas: పౌరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: అదానీతో మనకేంటి సంబంధం.. రక్షణ కేంద్రం ఏర్పాటైంది అంతే: రేవంత్ రెడ్డి

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

తర్వాతి కథనం
Show comments