Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ట్వంటీ20 సిరీస్ : నేడు రెండో మ్యాచ్

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం సెంచూరియన్‌ పార్క్ వేదికగా రెండో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు ప్రారంభంకానుంది.

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (12:36 IST)
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం సెంచూరియన్‌ పార్క్ వేదికగా రెండో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు ప్రారంభంకానుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెల్సిందే. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని దూకుడు మీద ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌ను సైతం కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కాగా కనీసం టీ20 సిరీస్‌ నైనా దక్కించుకుని పరువును కాపాడుకునేందుకు సఫారీలు చూస్తున్నారు. 
 
నిజానికి భారత క్రికెట్ జట్టు కుర్రోళ్ళు భీకర ఆటతీరుతో దక్షిణాఫ్రికాను బెంబేలెత్తిస్తూ ఆరు వన్డేల సిరీస్‌ను 5-1తో సగర్వంగా దక్కించుకుంది. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లోనూ అదే జోరు... తొలి మ్యాచ్‌లో విజయానంతరం సిరీస్‌ కోసం రెండో టీ20పై కన్నేసింది. సమష్టి ఆటతీరుతో విరుచుకుపడి మరో మ్యాచ్‌ ఉండగానే విజేతగా నిలవాలనుకుంటోంది. 
 
మరోవైపు సఫారీలు చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. సొంత గడ్డపై ఆడుతున్నా కూడా వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ప్రొటీస్‌ ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ గల్లంతైనట్టే. ఈ స్థితిలో టాప్‌ ఆర్డర్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించి భారత్‌ను దెబ్బతీయడంతో పాటు చివరి మ్యాచ్‌‌లోనూ విజయం సాధించి సిరీస్ విజయాన్ని నమోదు చేసుకోవాలని భావిస్తోంది. 
 
ఇరు జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్ శర్మ‌, శిఖర్ ధావన్‌, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌)/రాహుల్‌, పాండే, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్‌, ఉనాద్కట్‌/కుల్దీప్‌, బుమ్రా, చాహల్‌.
 
దక్షిణాఫ్రికా: స్మట్స్‌, హెన్‌డ్రిక్స్‌, డుమిని (కెప్టెన్‌), మిల్లర్‌, బెహర్డీన్‌, క్లాసెన్‌, ఫెహ్లుక్వాయో, మోరిస్‌, ఫంగిసో, డాలా, షంసి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

తర్వాతి కథనం
Show comments