Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. బ్రాడ్‌మన్‌ను అధికమిస్తారా?

భారత పరుగుల యత్నం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును బ్రేక్ చేసేందుకు కన్నేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు సారథిగానేకాకుండా ఓ బ్యాట్స్‌మెన్‌గా కూడా పరుగుల వరద పారిస్తున్నాడు.

అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. బ్రాడ్‌మన్‌ను అధికమిస్తారా?
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (16:45 IST)
భారత పరుగుల యత్నం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును బ్రేక్ చేసేందుకు కన్నేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు సారథిగానేకాకుండా ఓ బ్యాట్స్‌మెన్‌గా కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే టెస్టులు, వన్డే, టీ20ల్లో కలిపి 870 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో మూడు సెంచరీలు చేశాడు. 
 
అయితే, ఈ పర్యటనలో భారత్ మరో రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్‌లలో కలిపి 130 పరుగులు చేస్తే చాలు.. కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టే. అయితే, ఆ రికార్డు ఆషామాషీది కాదు.. పైగా, ఈ ఆధునిక కాలంలో నమోదైన రికార్డు అంతకన్నా కాదు. కొన్ని దశాబ్దాల క్రితం నమోదైన రికార్డు.
 
ఒక క్రికెటర్ విదేశీ గడ్డపై ఓ సిరీస్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన అరుదైన రికార్డు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. గత 1976లో ఇంగ్లండ్‌పై రిచర్డ్స్ 1,045 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు మరే ఆటగాడు ఆ దరిదాపులకు కూడా చేరుకోలేక పోయారు. 
 
ఆ తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో బ్రాడ్‌మన్ 974 పరుగులు చేయగా, ఆ తర్వాత 1976లో రిచర్డ్స్ 1000 పరుగులు చేసి బ్రాడ్‌మన్ రికార్డును సవరించాడు. అప్పటినుంచి ఈ రికార్డు ఎంతో పదిలంగా ఉంది. ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు విరాట్ కోహ్లీ చేరువగా వచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను వందశాతం ఫిట్.. రెండో టీ20 ఆడుతున్నా : విరాట్ కోహ్లీ