Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రావిడ్‌కు తేరుకోలేని షాకిచ్చిన బీసీసీఐ

భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేరుకోలేని షాకిచ్చింది. ద్రవిడ్ సమాన ప్రైజ్‌మనీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఏకంగా ఆయనకు ఇచ్చి

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (11:22 IST)
భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేరుకోలేని షాకిచ్చింది. ద్రవిడ్ సమాన ప్రైజ్‌మనీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఏకంగా ఆయనకు ఇచ్చిన ప్రైజ్‌మనీలో 25 లక్షల రూపాయలను కోత్ విధించింది. 
 
ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ టోర్నీలో దేశానికి కప్ అందించడంలో కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ అత్యంత కీలక భూమికను పోషించిన విషయం తెల్సిందే. దీంతో ద్రవిడ్‌కు బీసీసీఐ రూ.50 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే, క్రికెటర్లకు రూ.30 లక్షల చొప్పున, సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
 
అయితే, తనకు రూ.50 లక్షలు, సిబ్బందికి రూ.20 లక్షలు ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ద్రవిడ్.. వారు కూడా తనలాగే కష్టపడ్డారని, ప్రైజ్‌మనీ విషయంలో ఈ తేడాలెందుకంటూ బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన బీసీసీఐ ప్రైజ్‌మనీ ప్రకటనను సవరించింది. గతంలో ద్రవిడ్‌కు ప్రకటించిన రూ.50 లక్షలను రూ.25 లక్షలకు తగ్గించి, సహాయ సిబ్బందికి కూడా తలా రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ద్రావిడ్ షాక్‌కు గురయ్యాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments