Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఎఫెక్ట్ : పడిపోయిన కోహ్లీ ర్యాంక్

కొత్త పెళ్లికొడుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ పడిపోయింది. పెళ్లి కారణంగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరం కావడంతో ఆ ప్రభావం తన ర్యాంకుపై పడింది.

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (12:29 IST)
కొత్త పెళ్లికొడుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ పడిపోయింది. పెళ్లి కారణంగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరం కావడంతో ఆ ప్రభావం తన ర్యాంకుపై పడింది. ఫలితంగా మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారాడు. అదేసమయంలో మొదటి ర్యాంకును ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ కైవసం చేసుకున్నాడు. 
 
తాజాగా వెల్లడైన ఐసీసీ ర్యాంకుల జాబితాలో భారత క్రికెట్ జట్టు మాత్రం తన ర్యాంకుని మెరుగుపరుచుకుంది. తాత్కాలిక కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ సారథిగా విజయాలు సాధించడమే కాదు.. బ్యాటుతోనూ చెలరేగిపోయాడు. దీంతో ఇంగ్లండ్‌, ‌న్యూజిల్యాండ్‌, వెస్టిండీస్ జట్లను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలబడింది. పాక్ మొదటి స్థానంలో ఉంది. 
 
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు ముందు టీమిండియా ఖాతాలో 119 పాయింట్లు ఉండగా.. సిరీస్‌ తర్వాత 121 పాయింట్లకు పెరిగిందని, దీంతో టీమిండియా రెండో ర్యాంకును సొంతం చేసుకుందని ఐసీసీ తెలిపింది. ఇక 124 పాయింట్లతో పాకిస్థాన్ మొదటిస్థానంలో కొనసాగుతుంది.
 
పెళ్లి కారణంగా లంక సిరీస్‌కు దూరమవ్వడంతో ఈ ఎఫెక్ట్ కోహ్లీ టీ-20 ర్యాంకింగ్స్‌పై పడింది. దీంతో కోహ్లి ర్యాంకు మొదటి స్థానం నుంచి మూడోస్థానానికి పడిపోయింది. టీ-20 సిరీస్‌కు దూరమైన కారణంగా కోహ్లీ పాయింట్లు 824 నుంచి 776కు పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments