Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమేం పిచ్చోళ్లం కాదు.. ధోనీ ఫిట్నెస్ అమోఘం : రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వస్తున్న విమర్శలపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఒకింత ఘాటుగానే స్పందించారు. మేం పిచ్చోళ్లం కాదు.

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (11:04 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వస్తున్న విమర్శలపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఒకింత ఘాటుగానే స్పందించారు. మేం పిచ్చోళ్లం కాదు. గత 30 నుంచి 40 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా. కోహ్లీ కేవలం పదేళ్ల నుంచే క్రికెట్‌లో ఉన్నాడు. 26 ఏళ్ల వయసున్న ఆటగాడిని కూడా ధోనీ చిత్తు చేయగలడు అంటూ కితాబిచ్చాడు.
 
36 యేళ్ల వయసులో కూడా ధోనీ మైదానంలో అద్భుతంగా రాణిస్తూ యువ క్రికెటర్లకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అదేసమయంలో 2019 ప్రపంచ కప్‌లో వికెట్ కీపర్ రేసులో ధోనీదే మొదటి స్థానం అంటూ ఛీప్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ డైరెక్ట్‌గా చెప్పాడు. అయితే, ఇదేసమయంలో ధోనీపై క్రిటిక్స్ విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. 36 ఏళ్ల ధోనీ జట్టులో అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు. దీనిపై రవిశాస్త్రి ఒకింత ఘాటుగానే స్పందించారు. ధోనీ వయసు 36 ఏళ్లు అయినప్పటికీ... అతనికన్నా పదేళ్ల చిన్నవారైన ఆటగాళ్లకంటే చాలా ఫిట్‌గా, వేగంగా ఉన్నాడని చెప్పాడు. 
 
"మేమేం పిచ్చోళ్లం కాదు. గత 30 నుంచి 40 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా. కోహ్లీ కేవలం పదేళ్ల నుంచే క్రికెట్ లో ఉన్నాడు. 26 ఏళ్ల వయసున్న ఆటగాడిని కూడా ధోనీ చిత్తు చేయగలడు. విమర్శలు గుప్పిస్తున్న వారికి ఒకటే సూచన చేస్తున్నా. 36 ఏళ్ల వయసులో వారు ఎంత వరకు క్రికెట్ ఆడగలిగారు? ఒక రెండు పరుగులైనా వేగంగా పరుగెత్తగలిగారా? మీరు రెండు రన్స్ చేసే లోపు, ధోనీ మూడు పరుగులు చేయగలడు. ప్రస్తుత క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అత్యున్నత క్రికెటర్లలో ధోనీ ఒక్కడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పైగా, ధోనీలో ఉన్న గొప్ప లక్షణాలు మార్కెట్‌లో దొరికేవి కావు. మీరు వాటిని ఎక్కడా కొనలేరు కూడా. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపేయండి" అంటూ శాస్త్రి విమర్శకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో కోసం గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్యం వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

తర్వాతి కథనం
Show comments