అక్లాండ్ వన్డే మ్యాచ్ : శ్రేయాస్ మెరుపులు - భారత్ 306 రన్స్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (12:07 IST)
అక్లాండ్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత్ బ్యాటింగ‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు అర్థ శతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. 
 
ముఖ్యంగా, శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌కు పని చెప్పాడు. ఫలితంగా 76 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు. తొలుత ఓపెనర్‌లు ధావన్ 77 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేయగా, మరో ఓపెనర్ గిల్ 65 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఫలితంగా వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యంతో మంచి పునాది వేశారు. 
 
అయితే, మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్, రిషబ్ పంత్‌లు మరోమారు నిరాశపరిచారు. నాలుగో నంబరుగా బరిలోకి దిగిన పంత్ 23 బంతుల్లో 15 పరుగులు చేయగా, సూర్య కుమార్ 4, సంజూ శాంసన్ 36, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేశారు. ఫలితంగా భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌లు మూడేసి వికెట్లు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

తర్వాతి కథనం
Show comments