India beat West Indies: 140 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ

సెల్వి
శనివారం, 4 అక్టోబరు 2025 (14:31 IST)
Team India
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ను టీమిండియా సొంతం చేసుకుంది. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్.. నేటికి పూర్తయింది. ఈ తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు దుమ్ము దులిపేశారు. కేవలం మూడే రోజుల్లో మ్యాచ్‌ను ఫినిష్ చేసేశారు. ఏకంగా 140 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో టీమిండియా 1-0 తేడాతో ముందువరుసలో ఉంది. 
 
విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు స్టంప్స్ సమయానికి భారత్ 448 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆటలో విండీస్ బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 104, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ తర్వాత రవీంద్ర జడేజా కూడా సెంచరీ సాధించడంతో, ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు శతకాలు నమోదు చేసిన అరుదైన రికార్డు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments