ఆసియా కప్ 2025: తిలక్ వర్మ అదుర్స్.. ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకున్న టీమిండియా

సెల్వి
సోమవారం, 29 సెప్టెంబరు 2025 (07:26 IST)
Tilak varma
ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్‌తో ఉత్కంఠ భరితంగా సాగింది.ఆదివారం పాకిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో టీమిండియా 9వ ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. 
 
పాకిస్థాన్‌కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లకు మూడు ఓటమిపాలైంది. ఆసియా కప్ 2025 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా.. ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడైన మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని చెబుతూ..ఫైనల్ వేడుకను బహిష్కరించింది. 
 
ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకుంది. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్‌ను అభిషేక్ శర్మ అందుకున్నారు. ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సెలెబ్రేట్ చేసుకున్నారు. 
 
ఫైనల్ వేడుక వేదికపై ఉండి ట్రోఫీ చేతిల్లో ఉన్నట్లు ఊహించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ట్రోఫీ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments