Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం దిశగా టీమిండియా

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (12:04 IST)
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం దిశగా అడుగులు వేస్తోంది టీమిండియా. చివరి రోజు తొలి సెషన్‌లో మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో లంచ్ సమయానికి కోహ్లి సేన 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కోహ్లి (45), అశ్విన్ (2) ఉన్నారు. చివరి రోజు ఆండర్సన్ ధాటికి ఇండియన్ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 
 
గిల్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. పుజారా (15), రహానే (0), రిషబ్ పంత్ (11), వాషింగ్టన్ సుందర్ (0) విఫలమయ్యారు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. ఒక దశలో లంచ్‌కు ముందే ఆలౌటవుతారా అని అనిపించింది. అయితే కోహ్లి, అశ్విన్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 3, లీచ్ 2, బెస్ 1 వికెట్ తీశారు. అయితే మరో రెండు సెషన్ల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments