India vs Australia Live Score: వర్షంతో అంతరాయం.. ఆస్ట్రేలియా లక్ష్యం 317

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (21:18 IST)
India vs Australia
ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మెరిసింది. భారత ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్ రెండో వన్డేలోనూ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీతో చెలరేగిపోయాడు. 
 
ఇందులో భాగంగా శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది మూడో శతకం. సెంచరీ తర్వాత ఫోర్ కొట్టిన అయ్యర్ ఆ తర్వాత 105 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆపై గిల్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. 92 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆపై కాసేపటికే అవుట్ అయ్యాడు. 
 
ఇక భారత ఆటగాళ్లలో కెప్టెన్ కెఎల్ రాహుల్ 38 బంతుల్లో 52 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 72 పరుగులతో, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 31 పరుగులు సాధించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 399 పరుగులు చేసింది.
 
అయితే 400 పరుగుల భారీ లక్ష్యంతో క్రీజులోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభంలో వర్షం పడింది. ఫలితంగా డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. దీంతో ఆస్ట్రేలియా లక్ష్యం 317గా నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments