Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు టీ20 ఫీవర్ - నేడు ఉప్పల్‌లో మ్యాచ్

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:22 IST)
హైదరాబాద్ నగరానికి టీ20 ఫీవర్ పట్టుకుంది. ఆదివారం రాత్రి స్థానిక ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లూ శనివారం రాత్రే హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లూ సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో సిరీస్ ఫలితాన్న నిర్ధేసించే ఉప్పల్ మ్యాచ్ ఇపుడు హోరాహోరీగా సాగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ స్టేడియంలో చివరిగా సారిగా గత 2019 డిసెంబరుఆరో తేదీన చివరి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. భారత్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలిసారి బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 208 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 94 (నాటౌట్‌) విజృంభించడంతో టీమ్‌ఇండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 209 రన్స్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగిన కోహ్లీ.. కాట్రెల్‌ బౌలింగ్‌ సిక్సర్‌ కొట్టిన అనంతరం పెవిలియన్‌ వైపు చూస్తూ టిక్కు కొట్టిన సందర్భం అభిమానుల మదిలో ఇంకా తాజాగానే ఉంది. 
 
తుది జట్ల అంచనా.. 
భారత్ : రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పాండ్యా, కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌/ అశ్విన్‌. 
 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), గ్రీన్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఇంగ్లిస్‌, డావిడ్‌, వేడ్‌, కమిన్స్‌, ఎలీస్‌, జంపా, హజిల్‌వుడ్‌.
 
పిచ్‌, వాతావరణం పిచ్‌పై పచ్చిక లేదు. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments