Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : పొట్టి క్రికెట్‌లో విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (22:56 IST)
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోటీల్లో విశ్వవిజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలించిది. ఈ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు తమ ముందు ఉంచిన 173 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మరో ఏడు బంతులు మిగిలివుండగానే 2 వికెట్లను కోల్పోయి 173 పరుగులు చేసింది. ఫలితంగా మరోమారు పొట్టి క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. 
 
ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 77 నాటౌట్ (4 సిక్స్‌లు, 6 ఫోర్లు), ఆరోన్ ఫించ్ 5 (1 ఫోర్), మిచెల్ మార్ష్ 61 (4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ 28 (4 ఫోర్లు, 1 సిక్స్) చొప్పున పరుగులు చేయడంతో కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయాన్ని కైవసం చేసుకుంది. అదనపు పరుగుల రూపంలో పది రన్స్ వచ్చాయి. ఫలితంగా మరో 7 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేరుకుని మరోమారు పొట్టి క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. 
 
అంతకుముందు. టాస్ ఓడిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 48 బంతుల్లోనే 85 పరుగులు చేయడం విశేషం. 
 
విలియమ్సన్ 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఆసీస్ ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో విలియమ్సన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు.
 
ఇక ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 28, గ్లెన్ ఫిలిప్స్ 18, జేమ్స్ నీషామ్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 3, జంపా 1 వికెట్ తీశారు. స్టార్క్ దారుణంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నాడు.
 
ఇరు జట్ల వివరాలు.. 
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫర్ట్​ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్​, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడం మిల్నే, టిమ్​ సౌథీ, ఇష్​ సోధీ, ట్రెంట్ బౌల్ట్.
 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్, మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్​, మిచెల్ స్టార్క్, ఆండం జంపా, జోష్ హేజిల్​వుడ్. 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments