Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా విజయలక్ష్యం 173 రన్స్

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (21:18 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు ఆదివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ పోరులో ఆస్ట్రేలియాకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 85 పరుగులు చేశాడు.
 
కేన్ విలియన్స్ అర్థ శతకంతో అదరగొట్టాడు. ఫలితంగా 4 వికెట్లు కోల్పోయి.. 172 పరుగులు చేసింది కివీస్​. న్యూజిలాండ్​ బ్యాటర్లలో మార్టిన్ గప్తిల్ (28), మిచెల్ 11, ఫిలిఫ్స్ 18, నీషమ్ 13, సీఫర్ట్ 8 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్​వుడ్ మూడు, జంపా ఓ వికెట్ పడగొట్టారు. 
 
అంతకుముదు ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. న్యూజిలాండ్ జట్టు తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా, ఆసీస్‌కిది రెండో ఫైనల్ కావడం గమనార్హం. గత 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన కివీస్‌.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని భావిస్తుంది. 
 
ఇప్పటికే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్‌ సేన అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే గట్టిపట్టుదలతో ఉంది.
 
ఈ మ్యాచ్ కోసం కంగారులు జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలోకి దించారు. అయితే, కివీస్​ జట్టులో గాయం కారణంగా కాన్వే తప్పుకోగా, అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్​ చేరాడు.
 
ఇరు జట్ల వివరాలు.. 
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫర్ట్​ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్​, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడం మిల్నే, టిమ్​ సౌథీ, ఇష్​ సోధీ, ట్రెంట్ బౌల్ట్.
 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్, మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్​, మిచెల్ స్టార్క్, ఆండం జంపా, జోష్ హేజిల్​వుడ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

తర్వాతి కథనం
Show comments