Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా ఇంటికి... సెమీస్‌కు ఇంగ్లండ్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (22:04 IST)
సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్-12 గ్రూపు ఏలో శనివారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందింది. దీంతో ఇంగ్లండ్ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టగా, పాయింట్ల పరంగా మూడో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
 
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో గ్రూపు-1 నుంచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ గ్రూపులో తొలి స్థానంలో న్యూజిలాండ్ ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్ నిలిచింది. లంకపై ఇంగ్లండ్ జట్టు విజయంతో ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయి. ఒకవేళ్ల ఇంగ్లండ్‌పై లంక జట్టు గెలిచివుంటే, మ్యాచ్ పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లివుండేది. కానీ, ఇంగ్లండ్ గెలుపుతో గ్రూపు-1 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు టాప్‌-4లో నిలిచాయి. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేయగా, ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు 142 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి ఆరు వికెట్లను కోల్పోయి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments