ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం సూపర్-12 గ్రూపు 2లోని బంగ్లాదేశ్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు పోరాడి ఓడిపోయింది చివరి ఓవర్ చివరి బంతికి గెలిచే ఆ జట్టు గెలిచే అవకాశం ఉన్నప్పటికి ఓడిపోయింది. చివరకు 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బంగ్లాదేశ్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింద. ఓపెనర్ హుస్సేన్ షాం చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 71 రన్స్ చేశాడు. ఆ తర్వాత అఫీఫ్ హుస్సేన్ 29 పరుగులు చేశాడు. మిగిలిన ఆటగాళ్లు చేతులెత్తేశారు.
ఆ తర్వాత 151 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ఇద్దరూ సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. సీన్స్ విలియమ్స్ ఒక్కటే దాటిగా ఆడాడు. 42 బంతుల్లో 64 పరుగులు చేశాడు.
మిగిలిన ఆటగాళ్లు చేతులెత్తేశారు. 147 పరుగుల వద్ద ఆగిపోయింది. తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, మొసద్దిక్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లతో జింబాబ్వేను కట్టిడి చేశారు. తద్వారా బంగ్లాదేశ్ విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు.