Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు 'ప్రాణం' పోద్దాం : షోయబ్ అక్తర్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (15:40 IST)
భారత కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తారాస్థాయికి చేరుకుంది. పలు రాష్ట్రాల్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. దేశంలోని ఆస్పత్రులన్నీ ఫుల్ అయిపోయాయి. ఆక్సిజన్ నిల్వలు కరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాణవాయువు లభించక అనేక మందిరోజులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 
 
ఇలా కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌ను ఆదుకునేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ స‌మ‌యంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఇచ్చిన ఓ వీడియో సందేశం ఇండో-పాక్ అభిమానుల‌ను ఫిదా చేసింది. 
 
వైర‌స్‌పై పోరాటంలో భాగంగా ఇండియాకు స‌హాయం చేద్దామంటూ అతడు ఆ వీడియోలో పిలుపునిచ్చాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డం ఏ ప్ర‌భుత్వానికైనా అసాధ్య‌మ‌ని అక్త‌ర్ అన్నాడు. ఆక్సిజ‌న్ కొర‌తతో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌తదేశానికి ఆక్సిజ‌న్ ఇవ్వండంటూ పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 
 
'మా ప్ర‌భుత్వం, అభిమానుల‌ను ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజ‌న్ ట్యాంకులు కావాలి. ప్ర‌తి ఒక్క‌రూ ఇండియా కోసం విరాళాలు సేక‌రించి, వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ ట్యాంకుల‌ను అందించాల‌ని కోరుతున్నాను' అని త‌న యూట్యూబ్ చానెల్ వీడియోలో అక్త‌ర్ కోరాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments