తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మరో 8126 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 38 మంది వైరస్ వల్ల మరణించగా, 3307 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు చేరింది. ఇందులో 62,929 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 3,30,304 మంది కరోనా నుంచి కోలుకోగా, 1999 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.50 శాతంగా ఉండగా, రికవరీ రేటు 83.57 శాతంగా ఉన్నది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1259 కేసులు ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 676, రంగారెడ్డి జిల్లాలో 591, నిజామాబాద్‌లో 497, నల్లగొండలో 346, ఖమ్మలో 339, వరంగల్ అర్బన్‌లో 334 చొప్పున నమోదయ్యాయి.
అలాగే, , సిద్దిపేట మహబూబ్‌నగర్ జిల్లాల్లో 306, కరీంనగర్లో 286, జగిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201 చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 1,08,602 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,24,93,399కి చేరింది.
మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కేసులు నమోదు కాగా.. మరో 2767 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 2,17,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. కోలుకున్న వారు 1,40,85,110 మంది కాగా.. 1,92,311 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751గా ఉంది. ఇక ఇప్పటి వరకూ మొత్తం 14,09,16,417 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.