Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలంకలో డెడ్లీ కరోనా వైరస్.. గాలి ద్వారా సోకుతుందట.. గంటపాటు..?

శ్రీలంకలో డెడ్లీ కరోనా వైరస్.. గాలి ద్వారా సోకుతుందట.. గంటపాటు..?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (23:28 IST)
భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో కరోనా వైరస్ కొత్త జాతిని గుర్తించారు. కేవలం గంటపాటే ఈ డెడ్లీ వైరస్ గాలిలో ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇది ఇప్పటివరకు గుర్తించిన అన్ని వైరస్‌లలో కెల్లా ప్రాణాంతకమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జాతి వైరస్‌ గాలి ద్వారా సోకుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
 
శ్రీలంకలోని జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలోని ఇమ్యునాలజీ, మాలిక్యులర్ సైన్సెస్ విభాగాధిపతి నీలిక మాలావిగే ఈ కొత్త జాతికి సంబంధించిన విశేషాలను మీడియాకు వివరించారు. ఈ రకం వైరస్‌ చాలా తేలికగా, చాలా త్వరగా వ్యాపిస్తుందని చెప్పారు. శ్రీలంకలో కనిపిస్తున్న అన్ని వేరియంట్లలో ఈ జాతి అత్యంత ప్రాణాంతకమైనది, వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు.
 
గత వారం నూతన సంవత్సర వేడుకల నుంచి కొత్త జాతి వ్యాప్తి చెందడం శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులను కలవరపెడుతున్నది. యువతలో ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుండటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. 
 
రాబోయే రెండు, మూడు వారాల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎంతగా వ్యాపిస్తుందో, మూడవ వేవ్ వ్యాప్తి చెందుతుందని పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉపల్ రోహనా చెప్పారు. మొదటి ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు అంత స్పష్టంగా లేవని ఆయన అన్నారు. కొవిడ్ నుంచి రక్షణ కోసం మే 31 నాటికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్ పరిస్థితులు.. మళ్లీ మారటోరియం.. ఎంఎస్ఎంఈ విజ్ఞప్తి