కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో తమ రుణాలపై మారటోరియం విధించాలని ఎంఎస్ఎంఈలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుతున్నాయి. ఈ మేరకు ఎంఎస్ఎంఈ సంఘాలు కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాయనున్నాయి.
ఈ పరిస్థితుల్లో బ్యాంకుల రుణాలను చెల్లించడానికి తమకు అదనపు సమయం అవసరం అని ఎంఎస్ఎంఈల యాజమాన్యాలు పేర్కొన్నాయి. కనుక ఏ నిబంధనల కిందైనా సరే ఎంఎస్ఎంఈలకు రుణాలపై మరోమారు మారటోరియం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్ఐఎస్ఎంఈ) సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో పది రాష్ట్రాల్లో లాక్ డౌన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో తమ జరిగిన తమ వస్తువులు విక్రయానికి పేమెంట్లు ఇప్పటికిప్పుడు అందుకోలేమని ఎంఎస్ఎంఈలు వాదిస్తున్నాయి.
ఇందుకు అనుగుణంగానే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఎఫ్ఐఎస్ఎంఈ ప్రతినిధుల నుంచి ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్నసాధక బాధకాలు తెలుసుకున్నారు. ఇప్పటికే గతేడాది మార్చి నుంచి ఆరు నెలల పాటు రుణ వాయిదాల చెల్లింపులపై కేంద్రం, ఆర్బీఐ మారటోరియం ప్రకటించాయి.
ఆర్బీఐ విధించిన మారటోరియం వల్ల 30 శాం ఎంఎస్ఎంఈలు లాభపడ్డాయి. కానీ తాజాగా మరోమారు మారటోరియం విధించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీనివల్ల ఆయా బ్యాంకుల మొండి బాకీలు పెరిగిపోనున్నాయి.