Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెటీగల దాడితో ఆగిన క్రికెట్ మ్యాచ్... పరుగులు పెట్టిన రాహుల్ ద్రవిడ్...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (17:41 IST)
క్రికెట్ మ్యాచ్ మధ్యలో అనేకసార్లు అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని వినోదాన్ని పంచుతాయి, మరికొన్ని కాస్తంత కోపాన్ని తెప్పిస్తాయి. అయితే తేనెటీగల దాడి జరగడం అంటే ఓ వైపు తమాషాగా ఉన్నా మరోవైపు ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. అలాంటి ఘటనే ఈ రోజు చోటుచేసుకుంది. 
 
భారత్ ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ మైదానంలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆకస్మాత్తుగా తేనెటీగలు ప్రేక్షకులపై దాడి చేసాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా మైదానం బయటకు పరుగులు తీసారు. తేనెటీగల నుండి తమను తాము రక్షించుకోవడానికి చొక్కాలు విప్పి గాలిలో ఊపుతూ మరీ పరిగెత్తారు. 
 
మ్యాచ్‌లో 28వ ఓవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, మైదానంలోకి అవి రాలేదని అధికారులు తెలిపారు. అయితే గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రం దాడి చేసాయన్నారు. దాడి సమయంలో భారత్- ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అక్కడే ఉన్నాడని, అయితే వాటి నుండి తప్పించుకోవడానికి పరుగు తీసాడని చెప్పారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలించినట్లు స్పష్టం చేసారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments