Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ మహిళకు అరుదైన గౌరవం.. ఐసీసీ రిఫరీగా ఎంపిక

Webdunia
బుధవారం, 15 మే 2019 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జీఎస్ లక్ష్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఐసీసీ రిఫరీగా నియమితులైంది. ఇప్పటివరకు పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా అంపైర్‌గా క్లారీ పొలోసక్(ఆస్ట్రేలియా) రికార్డు నెలకొల్పింది. 
 
ఇపుడు తాజాగా భారత్‌కు చెందిన జీఎస్ లక్ష్మి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీల ప్యానెల్లో చోటు దక్కించుకున్న మొదటి మహిళగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో లక్ష్మి రిఫరీగా వ్యవహరించే అవకాశం వెంటనే అమల్లోకి రానున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 51 యేళ్ళ లక్ష్మి తన సొంత రాష్ట్రం ఆంధ్రతో పాటు బీహార్, ఈస్ట్‌జోన్, రైల్వేస్, సౌత్ జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. కుడిచేతి బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ మీడియం బౌలింగ్‌తో చిరస్మరణీయ విజయాల్లో కీలకమైంది. 
 
క్రికెటర్‌గానేకాకుండా 2008-09 మహిళల దేశవాళీ క్రికెట్ సీజన్‌లో తొలిసారి మ్యాచ్ రిఫరీగా లక్ష్మి బాధ్యతలు నిర్వర్తించింది. దీనికి తోడు మూడు అంతర్జాతీయ వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లకు రిఫరీగా విధులు చేపట్టింది. దీనిపై ఆమె స్పందిస్తూ, ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ చేత రిఫరీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందనీ, మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

నీతో మాట్లాడాలి రా అని పిలిచి మహిళా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

తర్వాతి కథనం