Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ఆ విషయంలో గంగూలీ కంటే ముందున్నాడు..

Webdunia
బుధవారం, 15 జులై 2020 (10:58 IST)
కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ ఆ విషయంలో దిట్ట అని తేల్చాడు. ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుత బీసీసీఐ బాస్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కంటే గొప్ప కెప్టెన్ అని తాజాగా నిర్వహించిన క్రికెట్ సర్వేలో తేలింది. తాజాగా నిర్వహించిన సర్వేలో ధోని గంగూలీ కంటే కొంచెం ముందంజలో ఉన్నారు. వన్డే కెప్టెన్సీలో ధోని 8.1 రేటింగ్ సాధించగా గంగూలీని 6.8తో నిలిచాడు. 
 
అయితే మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, కుమార్ సంగక్కర, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ శ్రీకాంత్ ఈ సర్వేలో పాల్గొని భారత గొప్ప కెప్టెన్‌ను నిర్ణయించారు. ఇక సౌరవ్ గంగూలీ వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి నాణ్యమైన క్రికెటర్లను ఎంఎస్ ధోనికి ఇచ్చినందుకు అతని పని సులభతరం అయిందని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. 
 
ఇక భారతదేశం చివరిసారిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ గెలుచుకుంది. అప్పటి నుండి ఐసీసీ పోటీలలో టీమిండియా విఫలమవుతూ వస్తోంది. ఇటీవల ముగిసిన 2019 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో మెన్ ఇన్ బ్లూ ఓడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

తర్వాతి కథనం
Show comments