Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయ కండువా కప్పుకున్న గంభీర్ - మోడీ విధానాలు నచ్చే చేరాను

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (17:15 IST)
గౌతం గంభీర్.. ఢిల్లీకి చెందిన ఈ మాజీ క్రికెటర్ కాషాయ కండువా కప్పుకున్నారు. దేశవ్యాప్తంగా తన ఆటతీరుతో ఎందరో అభిమానులను దక్కించుకున్నారు. దేశ రక్షణలో అమరులైన పలువురు జవాన్ల పిల్లలను దత్తత తీసుకున్నారు. మరికొందరి పిల్లల విద్యకు అయ్యే మొత్తం ఖర్చును భరించనున్నాడు. ఇలా క్రికెటర్‌ కంటే.. తన ఛారిటీ కార్యక్రమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైడ్లీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గంభీర్‌ను ఢిల్లీలోని ఓ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన గౌతమ్ గంభీర్.. ప్రధాని మోడీ నిర్ణయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. తనకు పార్టీలో చేరే అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నానని గంభీర్‌ తెలిపారు. 
 
దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై స్పందించిన గంభీర్, ఇటీవల పుల్వామా ఉగ్రదాడి అంశంలో కూడా పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టారు. బీజేపీలో చేరిన ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామంటూ బీజేపీ కూడా చెబుతుంది. పార్టీ సెలక్షన్ కమిటీ గంభీర్‌కు ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై సమాలోచనలు జరుపుతుందని చెప్పారు. ఇటీవలే గంభీర్‌కు పద్మా పురస్కారం కూడా లభించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments