Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ క్రికెట్ మైదానం గేటుకు దిగ్గజ క్రికెటర్ల పేర్లు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (08:57 IST)
క్రికెట్ ప్రపంచంలోని ఉద్ధండులైన భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా గౌరవార్థం సిడ్నీ క్రికెట్ మైదానంలోని ఒక గేటుకు బ్రియాల్ లారా - సచిన్ టెండూల్కర్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సిడ్నీ క్రికెట్ నిర్వాహకులు వెల్లడించారు. 
 
సచిన్ డెండూల్కరిన్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయన గౌరవార్థం ఈ పేరు పెట్టారు. ఈ మైదానంలో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్... మూడు సెంచరీలతో 785 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 241 నాటౌట్. గత 2004 ఈ స్కోరు చేయగా, ఈ స్టేడియంలో సచిన్ సగటు పరుగులు 157. 
 
దీనిపై సచిన్ స్పందిస్తూ, భారత్ అవతర.. సిడ్నీ మైదానం నాకు ఎంతగానో ఇష్టమైనది. నా మొదటి ఆస్ట్రేలియా (1991-92) ప్రయాణంలో ఈ మైదానంలో ఎన్నో చిరస్మరణీయమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మైదానంలో తన సహచర క్రికెటర్ బ్రియానా లారా పేరుతో పాటు తన పేరును కూడా ఈ స్టేడియంలోని ఓ గేటుకు పెట్టడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సిడ్నీ క్రికెట్ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే, బ్రియాన్ లారా కూడా ఈ మైదానంలో 30 యేళ్ళ క్రితం జరిగిన టెస్టులో 277 పరుగులు చేశాడు. ఈ రికార్డు జ్ఞాపకార్థం అతని పేరును కూడా పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

రాందేవ్ బాబుకు అరెస్ట్ వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?

కాలువలోకి దూసుకెళ్లిన జీపు... 9 మంది మృత్యువాత (Video)

మార్కాపురం రైల్వే స్టేషన్‍‌లో నరకయాతన అనుభవించిన ప్రయాణికులు...

యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

తర్వాతి కథనం
Show comments