భారత క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డే మ్యాచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇపుడు వన్డే మ్యాచ్‌లు బోరు కొట్టేస్తున్నాయంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. తన వన్డే కెరీర్‌లో 50కిపైగా సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ నోట ఇటువంటి మాటలు రావడంతో ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు.
వన్డే మ్యాచ్‌లు కాస్తంత బోర్ కొట్టేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వన్డే ఫార్మెట్‍కు మార్పులు చేర్పులు చేయాలని ఆయన సూచించారు. టెస్టుల విషయంలోనూ ఆయన స్పందించారు. ఈ మ్యాచ్‌లు కూడా మరింత ఆకర్షణీయంగా సాగేలా చూడాలని ఆయన కోరారు. మ్యాచ్‌లు ఎన్నిరోజుల పాటు సాగిందన్న అంశానికి ప్రాధాన్యత లేదన్నారు.
మ్యాచ్‌లపై ఆకర్షణీయత కొనసాగించేందుకు ఈ ఫార్మెట్‌పై ప్రజల దృష్టి మళ్లేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇటీవల స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లు మూడున్నర రోజుల్లోనే ముగియడంపై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెదవి విరిచిన విషయంతెల్సిందే. ఈ మ్యాచ్‌ల కోసం తయారు చేసిన పిచ్‌లపై విమర్శలు గుప్పించారు.