Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన భారత్ ఆల్‌రౌండర్

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (14:36 IST)
భారత క్రికెట్ జట్టుకు చెందిన ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారత క్రికెట్ జట్టు తరపున 2014-16 మ‌ధ్య‌ స్టువ‌ర్ట్ బిన్నీ 6 టెస్టులు, 14 వ‌న్డేలు, 3 టీ20లు ఆడాడు. 
 
37 ఏళ్ల స్టువ‌ర్ట్ బిన్నీ ఈ సంద‌ర్భంగా బీసీసీఐతోపాటు త‌న దేశ‌వాళీ టీమ్ క‌ర్ణాట‌క‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. 1983లో క్రికెట్ వ‌రల్డ్‌క‌ప్ గెలిచిన టీమ్‌లో స‌భ్యుడైన రోజ‌ర్ బిన్నీ కుమారుడే ఈ స్టువ‌ర్ట్ బిన్నీ. 
 
ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌, అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాను అని ఆ ప్ర‌క‌ట‌న‌లో స్టువ‌ర్ట్ బిన్నీ చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం ఎంతో సంతోషంగా ఉన్న‌ద‌ని అన్నాడు.
 
అలాగే, టెస్టుల్లో 194 ప‌రుగులు మూడు వికెట్లు తీసిన అత‌డు.. వ‌న్డేల్లో 230 ప‌రుగులు, 20 వికెట్లు.. టీ20ల్లో 24 ప‌రుగులు చేసి ఒక వికెట్ తీశాడు. ఇండియా త‌ర‌ఫున స్టువ‌ర్ట్ బిన్నీకి ఓ మ‌రుపురాని మ్యాచ్ ఉంది. 
 
2014లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బిన్నీ లెజెండ‌రీ బౌల‌ర్ అనిల్ కుంబ్లే రికార్డును తిర‌గ‌రాశాడు. ఆ మ్యాచ్‌లో 4.4 ఓవ‌ర్లు వేసిన అత‌డు.. కేవ‌లం 4 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇండియా త‌ర‌ఫున వన్డేల్లో ఇదే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

తర్వాతి కథనం
Show comments