Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సిక్సర్లు : భారత తొలి ఆటగాడిగా ధోనీ రికార్డు!

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (18:21 IST)
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో అదిరిపోయే రికార్డు సాధించాడు. 30 యేళ్ల నిండిన తర్వాత ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత అటగాడిగా నిలిచాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్‌ దేశ్‌పాండే వేసిన 19 ఓవర్‌లో సిక్స్ బాదడం ద్వారా ధోనీ ఈ ఫీట్ సాధించాడు. 
 
ఓవరాల్‌గా ఈ జాబితాలో ధోనీ రెండో స్థానంలో ఉండగా, క్రిస్‌గేల్ (347 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్ళ విషయానికొస్తే.. ధోనీ తర్వాత రోహిత్ శర్మ (113), అంబటి రాయుడు (109), దినేశ్ కార్తిక్ (104) మాత్రమే 30 యేళ్లు నిండిన తర్వాత 100 కంటే ఎక్కువ సిక్సర్లు బాదారు. 
 
ప్రస్తుతం ధోనీ వయసు 43 యేళ్లు, అయినప్పటికీ ఫిట్నెస్‌ను కాపాడుకుంటూ ఐపీఎల్‌లో తన కేరీర్‌ను కొనసాగిస్తున్నాడు. పూర్తిస్థాయి వికెట్‌కీపర్‌గా ఉంటూ మెరుపు స్టంపింగ్స్ చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో మాత్రం మునుపడి జోరును ప్రదర్శించిలేకపోతున్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చిన ధోనీ 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అటు సీఎస్కే కూడా ఈ సారి ఆకట్టుకోలేకపోయింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన చెన్నై తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌‍లలో ఓడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments