Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీల్‌ఛైర్‌‍లో ఉన్నా సరే ఫ్రాంచైజీ లాక్కెళ్లిపోతుంది.. సో... నేను ఆడుతూనే ఉంటా : ధోనీ

Advertiesment
MS Dhoni

ఠాగూర్

, ఆదివారం, 23 మార్చి 2025 (19:45 IST)
తాను ఆడలేక వీల్‌చైర్‌లో కూర్చొనివున్నా సరే ఫ్రాంచైజీ లాక్కెళ్లిపోతుందని, అందువల్ల ఎన్నాళ్లు ఆడాలనుకుంటే అంతకాలం ఆడుతూనే ఉంటానని మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అయిన ధోనీ... ఐపీఎల్ 18వ సీజన్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెపుతారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై ధోనీ ప్రశాంతంగా స్పందించారు. 
 
"చెన్నై సూపర్ కింగ్స్ - సీఎస్కే. ఇది నా ఫ్రాంచైజీ. సీఎస్కే తరపున మరింత కాలం ఆడాలని అనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్‌ఛైర్‌లో ఉన్నాసరే వాళ్లు నన్ను లాక్కెళుతారు" అని వ్యాఖ్యానించారు. 2023 ఐపీఎల్ సందర్భంగా మోకాలి గాయంతో బాధపడిన ధోనీ.. ఆ సీజన్ ముగిశాక సర్జరీ చేయించుకున్నాడు. గత యేడాది ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎనిమిదో ప్లేస్‌లోనూ బ్యాటింగ్ చేశాడు. అయితే, ఈ సారి మాత్రం పూరతిస్థాయి ఫిట్నెస్ సాధించి జట్టులో ఒక సభ్యుడుగా సేవలు అందించేందుకు సిద్ధమయ్యాడు. అలాగే, బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ కాస్త ముందుకు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IPL 2025: విరాట్ కోహ్లీ 1000 పరుగులు.. కేకేఆర్‌ను చిత్తుగా ఓడించిన RCB (Video)