Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ! (Video)

Advertiesment
ms dhoni
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యూనిమల్' సినిమాతో పాన్ ఇండియా దర్శకుడుగా మారిపోయారు. రణబీర్ కపూర్‌ హీరోగా వచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లతో సాండీ స్థాయిని అమాంతం పెంచేసింది. దీంతో ఆయన ప్రభాస్‌తో తీయబోయే "స్పిరిట్" చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఇదిలావుంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నటించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ప్రకటన తాలూకూ వీడియో అది. వీడియోలో 'యూనిమల్' సినిమాలో హీరో రణబీర్‌ క్యారెక్టర్‌లో ధోనీ సైకిల్‌పై రావడాన్ని సందీప్ రెడ్డి చిత్రీకరించడం మనం చూడొచ్చు. 
 
కాగా, ఈ యాడ్‌కు సంబంధించిన పూర్తి వీడియో త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమోలే మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఎంఎస్‌డీ, సాండీ కాంబోలోని యాడ్‌ తాలూకూ ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mohanbabu: మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహదేవ శాస్త్రి పరిచయ గీతం