Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఫిఫా-17’ విజేత ఇంగ్లాండ్‌.. ఫ్రెంచ్ ఓపెన్ సింధు ఓటమి

భారత్‌లో నిర్వహించిన ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో యురోపియన్‌ అండర్‌-17 విజేత స్పెయిన్‌ను 5-2 తేడాతో చిత్తుగా ఓడించింది. 10, 31 నిమిషాల్లో గోల్స్‌ కొట

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (09:58 IST)
భారత్‌లో నిర్వహించిన ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో యురోపియన్‌ అండర్‌-17 విజేత స్పెయిన్‌ను 5-2 తేడాతో చిత్తుగా ఓడించింది. 10, 31 నిమిషాల్లో గోల్స్‌ కొట్టి స్పెయిన్‌ను ఆధిక్యంలో నిలిపాడు సెర్గియో గోమెజ్‌. 
 
వీరికి ఆ ఆనందం ఇంగ్లండ్ దక్కనీయలేదు. ఆట ద్వితీయార్ధంలో బ్రూస్టర్‌ (44 ని), గిబ్స్‌ వైట్‌ (58 ని), ఫోడెన్‌ (69 ని, 88 ని), గ్యూహి (84 ని) గోల్స్‌ సాధించారు. వీరి ధాటికి స్పెయిన్‌ డిఫెన్స్‌ చెల్లాచెదురైంది. అండర్‌-17 ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ గెలవడం ఇదే తొలిసారి.
 
అలాగే, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో ఓటమి పాలైంది పీవీ సింధు. శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచి చేతిలో 21-14, 21-9 తేడాతో పరాజయం పొందింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో సింధు పోరు ముగిసింది. 
 
శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫీపై విజయం సాధించడంతో.. సింధుపై భారీ ఆశలు పెట్టుకున్నారు భారత అభిమానులు. అయితే సెమీస్‌లో సింధు ఓటమితో ఆశలు ఆవిరయ్యాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments