Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20ల్లో డబుల్ సెంచరీ ఆలోచన చేయడం అత్యాశే : రోహిత్ శర్మ

ఇండోర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేసి, గతంలో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (11:45 IST)
ఇండోర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేసి, గతంలో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం తన వేగవంతమైన టీ20 సెంచరీపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ స్పందించాడు. 
 
ఇండోర్ స్టేడియంలో పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎప్పటిలా బంతిని లైన్‌లో ఆడేందుకే ప్రయత్నించి విజయవంతమయ్యాను. ఈ మ్యాచ్‌లో పూర్తిగా బ్యాటింగ్‌ను ఆస్వాదించానని, సెంచరీ పూర్తయ్యాక 200 గురించి అస్సలు ఆలోచించలేదు. అలా ఆలోచన చేస్తే ఖచ్చితంగా అది అత్యాశే అవుతుందని.. ఈ పిచ్‌పై ఎంత భారీ స్కోరైనా నిలవడం కష్టం. అందుకే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే దృష్టిసారించానని రోహిత్ చెప్పుకొచ్చాడు. 
 
కాగా, రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకుంది. దీంతో పర్యాటక శ్రీలంక జట్టు భారత గడ్డపై ఆడిన టెస్ట్, వన్డే, ట్వంటీ20 సిరీస్‌ల్లో ఏ ఒక్కదాన్నీ కూడా గెలుచుకోలేక పోయింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments