Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ టెస్టులో ఇంత "కంగారు"పడిపోతారని ఊహించలేదు : రోహిత్ శర్మ

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (13:46 IST)
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంతలా కంగారుపడిపోయి మూడు రోజులకే చేతులు ఎత్తివేస్తారని ఊహించలేక పోయామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 1-0 తేడాతో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో అనూహ్య వైఫల్యంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. 
 
"ఆస్ట్రేలియా కేవలం ఒక్క సెషన్‌లోనే కుప్పకూలుతుందని మేం అస్సలు ఊహించలేదు. పటిష్టంగా బౌలింగ్ చేయాలనే ముందే ఊహించుకున్నాం. ఒక్కో సేషన్‌ గడిచే కొద్దీ మ్యాచ్‌పై పట్టు బిగించాలనేది మా ప్రణాళిక. కానీ, ఆస్ట్రేలియా ఒకే సేషన్‌లో ఆలౌట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. పిచ్‌ బౌన్స్‌పై లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ, మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రెడిట్ వారికే దక్కుతుంది" అని రోహిత్ అన్నారు. 
 
కాగా, నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. రెండే ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు చిత్తుగా ఓడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments