Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. ప్రూఫ్ ఇదేనంటున్న నెటిజన్లు!!

మళ్లీ తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. ప్రూఫ్ ఇదేనంటున్న నెటిజన్లు!!
Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (13:42 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్ళీ తండ్రి కాబోతున్నారు. దీనికి ఒక ప్రూఫ్‌ను కూడా నెటిజన్లు చూపిస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో అనుష్క శర్మ వదులైన దుస్తులు వేసుకుని కనిపించారు. బేబీ బంప్ కూడా స్పష్టంగా కనిపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, ఇంతకంటే మరో నిదర్శనం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నా.. విరాట్ కోహ్లీ దంపతులు స్పందించడం లేదు. అయిన్ నెటిజన్లు మాత్రం తగ్గేలేదంటూ తమ అభిప్రాయాలను యధేచ్చగా నెట్టంట పంచుకుంటున్నారు. తమ వాదనకు మద్దతుగా ఓ వైరల్ వీడియోను ప్రస్తావిస్తున్నారు. ఓ హోటల్‌లో విరాట్, అనుష్క ఉన్న వీడియోను సోషల్ మీడియా యూజర్ ఒకరు నెట్టింట షేర్ చేశారు. 
 
సెంచరీల కింగ్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన వివ్ రిచర్డ్స్  
 
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ ప్రపంచంలోని అత్తుత్తమ ఆటగాళ్ళలో ఒకటిగా అభివర్ణించాడు. మైదానంలో తమ ఇద్దరి దూకుడు ఒకటేలా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. 
 
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ అత్యుద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నారు. దీనిపై వివ్ రిచర్డ్స్ స్పందిస్తూ, "ఈ టోర్నీలో ఎందరో గొప్ప ఆటగాళ్లను చూశాం. కానీ, వీళ్లందరిలో టాప్ ఎవరంటే మాత్రం విరాట్ కోహ్లీనే. నేను అతడికి వీరాభిమానిని. సచిన్ వంటి క్రికెట్ దిగ్గజాల మధ్య ఒకటిగా విరాట్ నిలిచిపోతాడు' అంటూ కితాబిచ్చాడు. 
 
కాగా, ప్రపంచ కప్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫామ్‌లేమిపై ఆయన స్పందిస్తూ, ప్రపంచ కప్‌ ఆరంభానికి ముందు విరాట్ క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు ఇక అవసరం లేదని కూడా కొందరు అసాధారణ కామెంట్స్ చేశారు. కానీ, విరాట్ మళ్లీ ఫామ్ సాధించడంలో అతడి వెన్నంటి ఉన్నవారు, బ్యాక్ రూం స్టాఫ్‌కే క్రెడిట్ దక్కుంది. ఇపుడతను మళ్లీ తన అత్యద్భుత ప్రదర్శన స్థితికి వచ్చేశాడు. 
 
క్రికెటర్ల ఫామ్ తాత్కాలికమని అంటారు కానీ, విరాట్ తాను ప్రత్యేకమని నిరూపించుకున్నామన్నాడు. అతడిని చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా ఫోకస్డ్‌గా కనిపిస్తున్న అతడు క్రికెట్‌కు దక్కిన ఓ గొప్ప క్రీడాకారుడు అని రిచర్డ్స్ అని వ్యాఖ్యానించాడు. అలాగే, మైదానంలో మా ఇద్దరి తీరు ఒకేలా ఉంటుందని, అందుకే కోహ్లీని తనతో అనేక మంది పోల్చుతుంటారని వివ్ రిచర్డ్స్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు- స్పెషల్ అట్రాక్షన్‌గా దేవాన్ష్ (video)

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

Jagan: ఈ ప్రభుత్వం 2-4 నెలల్లో మారవచ్చు.. డీఎస్పీకి జగన్‌కు వార్నింగ్

ఈ ప్రభుత్వం 2 లేదా 4 నెలల్లో మారిపోవచ్చు.. తర్వాత మీ కథ ఉంటుంది : వైఎస్ జగన్

నారా లోకేష్ సంచలనాత్మక నిర్ణయం.. ఒకే పుస్తకం.. ఒక నోట్ బుక్.. పుస్తకాల బరువు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా బతికివున్నానంటే అందుకు కారణం అదే : దర్శకుడు గౌతం మేనన్

గేమ్ ఛేంజర్ కథ మధ్యలో ఛేంజ్ చేశారా? జనవరి 10న కలిసిరాలేదా?

నాగబంధం నుంచి రుద్రగా విరాట్ కర్ణ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి

డాకు మహారాజ్ తో సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన శ్రద్దా శ్రీనాథ్

డాకు మహారాజ్ సీక్వెల్ తీస్తా : డైరెక్టర్ బాబీ

తర్వాతి కథనం
Show comments