Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సమయస్ఫూర్తికి జోహార్లు..(Video)

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (10:46 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తాడు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా వుంటాడు. తాజాగా హామిల్టన్ వేదికగా కివీస్‌తో ఆదివారం ముగిసిన చివరి టీ-20 మ్యాచ్‌లోనూ ఓపెనర్ స్టీఫర్ట్‌ని ధోనీ స్టంపౌట్ చేశాడు.


ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ చేస్తుండగా జాతీయ జెండాని చేతిలో పట్టుకుని ఓ భారత అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు. అతను తనవైపు రావడాన్ని పసిగట్టిన ధోనీ.. అలానే నిల్చుండి పోయాడు. 
 
భావోద్వేగానికి గురైన అభిమాని నేరుగా వచ్చి అతని కాళ్లపై పడిపోయాడు. అభిమాని ధోనీ కాళ్లపై పడుతుండగా, జాతీయ జెండా నేలను తాకబోతుండటాన్ని గమనించిన మహేంద్రుడు.. వెంటనే స్పందించాడు. 
 
అభిమాని చేతుల్లోని ఆ జెండాని తన చేతుల్లోకి తీసుకుని.. అతడిని వెళ్లిపోవాలని సూచించాడు. ఆపై జెండాని భద్రతా సిబ్బందికి అప్పగించాడు. ఇప్పటికే భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న ధోనీ.. విదేశీ గడ్డలో జాతీయ జెండా గౌరవం నిలపడంపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కాగా హామిల్టన్‌లో కివీస్‌తో జరిగిన చివరి ట్వంటీ-20 మ్యాచ్‌ను ఆడటం ద్వారా ధోనీ తన ఖాతాలో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధోనీ 300వ టీ-20 మ్యాచ్‌ను ఆడిన భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments