Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాహల్ - ధనశ్రీ విడాకుల ఖరీదు రూ.4.75 కోట్లు!!

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (16:53 IST)
భారత క్రికెట్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీలు విడిపోయారు. వీరికి ముంబైలోని బాంద్రా కోర్టు గురువారం అధికారికంగా విడాకులు మంజూరుచేసింది. ఈ మేరకు చాహల్ తరపు న్యాయవాది నితీశ్ కుమార్ గుప్తా మీడియాకు వెల్లడించారు. అయితే, ఈ విడాకుల ఖరీదు రూ.4.75 కోట్లు. ఈ మొత్తాన్ని ధనశ్రీకి ఇచ్చేందుకు చాహల్ అంగీకరించారు. 
 
ఇదే అంశంపై చాహల్ న్యాయవాది మాట్లాడుతూ, ముంబై ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన ధనశ్రీ వర్మ, చాహల్‌ వారు తమ విడాకుల తుది పత్రాల ప్రక్రియను పూర్తి చేశారు. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇచ్చేందుకు చాహల్ అంగీకరించాడు అని తెలిపారు.
 
కాగా, ఈ దంపతులకు గత 2020లో వివాహం కాగా, గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి గురువారం కోర్టు విడాకులు మంజూరు చేయడంతో అధికారికంగా విడిపోయారు. 
 
చాహల్ ఐపీఎల్ టోర్నీలో పాల్గొనాల్సివున్నందున ఈ విడాకుల కేసులో గురువారం తుది తీర్పును ఇవ్వాలని కింది కోర్టును ముంబై హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ తుది తీర్పును వెలువరించారు. 
 
ఇదిలావుంటే, చాహల్ పంజాబ్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగుతున్నాడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడాడు. ఈ సీజన్‌కు పంజాబ్ జట్టు రూ.18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments