Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 : సూపర్ ఓవర్‌లో ఢిల్లీ సూపర్ విజయం - సరికొత్త రికార్డు

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (09:35 IST)
ఐపీఎల్ 2025 పోటీల్లో భాగంగా, ఢిల్లీ కేపిటల్స్ జట్టు రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు మూడు విజయాల పేరుతో పంజాబ్ కింగ్స్ జట్టు పేరిట ఉన్న రికార్డును ఢిల్లీ జట్టు చెరిపేసింది. బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఢిల్లీ జట్టు సూపర్ విజయాన్ని అందుకుంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్ టైగా ముగిసింది. 
 
దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ అనూహ్యంగా విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన జట్టుగా రికార్డు పుటలకెక్కింది. సూపర్ ఓవర్‌లో ఓ జట్టు ఇన్నిసార్లు విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈ రికార్డు ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్ మూడుసార్లు సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇపుడు ఆ రికార్డును ఢిల్లీ చెరిపేసింది. అంతేకాకుండా, మరో రికార్డును కూడా ఢిల్లీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు అంటే ఐదు టై మ్యాచ్‌‍లు ఆడిన జట్టుగాను మరో రికార్డు సాధించింది. ఇక ఢిల్లీ, పంజాబ్ తర్వాత ముంబై, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలా రెండు సూపర్ ఓవర్లలో విజయం సాధించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments